మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (10:51 IST)

కేంద్రం నుంచి తెలంగాణకు చిల్లిగవ్వ కూడా రాలేదు

telangana govt
కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు అందటం లేదు. కేంద్రం నుంచి చిల్లిగవ్వ కూడా తెలంగాణకు నిధుల పేరిట అందలేదని తెలంగాణ సర్కారు ఫైర్ అవుతోంది.

ఆర్థిక సంఘం సూచించిన మేరకు కేంద్రం ప్రతి నెలా రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. 
 
ఆ మాట నిజమైతే తెలంగాణకు ఇవ్వాలని 13, 14, 15వ ఆర్థిక సంఘాలు సూచించిన రూ.3051.24 కోట్ల నిధులను ఇప్పటివరకు రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. 
 
వీటితోపాటు చట్టబద్ధంగా రావాల్సిన ఇతర నిధులను కలిపితే తెలంగాణకు రూ.7 వేల కోట్లు రావాల్సి ఉన్నదని స్పష్టం చేస్తున్నారు. ఈ మొత్తాన్ని వెంటనే కేంద్రం నుంచి విడుదల చేయించాలని ఈటెలను డిమాండ్‌ చేస్తున్నారు.