గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 14 జులై 2022 (17:46 IST)

క్వాంటమ్‌ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ను విడుదల చేసిన క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌

Cash
క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఇప్పుడు క్వాంటమ్‌ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ను విడుదల చేసింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ పథకం. ప్రధానంగా నిఫ్టీ 50 ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెడుతుంది. వినూత్నమైన, భారతదేశపు మొట్టమొదటి నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ క్వాంటమ్‌ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌.


ఈటీఎఫ్‌ సామర్థ్యంను ఇండెక్స్‌ ఫండ్‌ యొక్క సౌకర్యంతో ఈ ఫండ్‌ మిళితం చేయడంతో పాటుగా మదుపరులకు ద్వంద్వ ప్రయోజనాలను అందిస్తుంది.  భారతదేశపు నిఫ్టీ టాప్‌ 50లో డీమ్యాట్‌ ఖాతా తెరవకుండానే పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత సౌకర్యవంతమైన మార్గం క్వాంటమ్‌ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌. ఈ నూతన ఫండ్‌ ఆఫర్‌ జూలై 18,2022న తెరుస్తారు. ఆగస్టు 01,2022న మూసి వేస్తారు.

 
క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐఓ చిరాగ్‌ మెహతా మాట్లాడుతూ, ‘‘క్వాంటమ్‌ యొక్క డీఐవై 12-20-80 ఆస్తి కేటాయింపు వ్యూహంతో మదుపరులు తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో అభివృద్ధి చేసుకోవచ్చు. మీ దీర్ఘకాలిక వ్యూహాలను చేరుకోవడంలో మీకు ఇది తోడ్పడుతుంది. ఈ వ్యూహం ప్రకారం మదుపరులు 12 నెలల తమ ఖర్చులను లిక్విడ్‌ ఫండ్‌కు అంకితం చేస్తే, 20% పెట్టుబడులు పెట్టాల్సిన నగదును బంగారంలో, మిగిలిన 80%ను ఈక్విటీకి కేటాయిస్తారు.  మదుపరులు తమ ఈక్విటీ పెట్టుబడులలో 85%ను క్వాంటమ్‌ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌లో పెట్టుబడి పెడితే, 15%ను క్వాంటమ్‌ ఇండియా ఈఎస్‌జీ ఈక్విటీ ఫండ్‌కు కేటాయించవచ్చు’’ అని అన్నారు.

 
హితేంద్ర పరేఖ్‌ ఈ స్కీమ్‌కు ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరించనున్నారు. జూలై 10,2008లో ప్రారంభించిన నాటి నుంచి క్వాంటమ్‌ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ను ఈయన నిర్వహిస్తున్నారు. ఈ ఆవిష్కరణ సందర్భంగా హితేంద్ర మాట్లాడుతూ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ప్రణాళిక చేసుకునే వారికి ఇది సహాయపడుతుందన్నారు.