గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జులై 2022 (16:07 IST)

మరాఠీలకు శుభవార్త చెప్పిన సీఎం ఏక్‌నాథ్ షిండే

petrol
ఇటీవల మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సాథ్యంలో శివసేన రెబెల్స్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ బాధ్యతలు స్వీకరించారు. ఇపుడు ఈ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్ర వాసులకు శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గించింది. 
 
ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.111.35గా ఉండగా, తాజా తగ్గింపుతో రూ.106.35కి తగ్గనుంది. అదేసమయంలో రూ.97.28గా డీజిల్.. రూ. 94.28కే లభ్యం కానుంది. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.6 వేల కోట్ల మేర భారం పడనుంది. అయితే ఈ చర్య వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి రానుందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు.