సోమవారం, 2 అక్టోబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (08:20 IST)

సెప్టంబరు 28న నుంచి భారత్‌లో సౌతాఫ్రికా పర్యటన

south africa
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ సిరీస్ జరుగనుంది. సెప్టెంబరు 28వ తేదీ నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది. ఆ తర్వాత అక్టోబరు ఆరో తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య మొత్తం మూడేసి వన్డే, టీ20 మ్యాచ్‌ల సిరీస్ మొదలవుతుంది. ఇందుకోసం సౌతాఫ్రికా జట్టు వచ్చే నెలలో భారత్ ‌పర్యటనకు రానుంది. 
 
సెప్టెంబరు 28న టీ20 సిరీస్ మొదలుకానుండగా, అక్టోబరు 6వ తేదీన వన్డే సిరీస్‌ మొదలుకానుంది. అక్టోబరు 11వ తేదీ నాటికి సిరీస్‌లను పూర్తి చేసుకోనున్న సౌతాఫ్రికా తన పపర్యటను ముగించుకుంటుంది. ఈ మేరకు రెండు సిరీస్‌ల పూర్తి షెడ్యూల్‌ను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా బుధవారం రాత్రి ప్రకటించింది.