గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (18:02 IST)

రేపు "సీతా రామం" ప్రిరిలీజ్ ఈవెంట్

sitaramam
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణలా ఠాకూర్ జంటగా నటించిన చిత్రం "సీతారామం". ఈ చిత్రం ఈ నెల 5వ తేదీన ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్‌ను బుధవారం విడుదల చేయనుంది. అశ్వనీదత్ సమర్పణలో స్వప్న సినిమాస్ పతాకంపై తెరకెక్కగా, హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. "యుద్ధంతో రాసిన ప్రేమకథ" అనే ఉపశీర్షికను ఉంచారు. 
 
5వ తేదీన విడుదలకానున్న నేపథ్యంలో బుధవారం రాత్రి 7 గంటలకు ఈ ప్రిరిలీజ్ వేడుకను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ను కొద్దిసేపటి క్రితం రిలీజ్చేశారు. ఈ చిత్రం ద్వారా మరాఠీ నటి మృణాల్ ఠాగూర్ తెలుగు వెండితెరకు పరిచయం కానుంది. 
 
విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చగా, రష్మిక మందన్నా ఓ కీలకమైన పాత్రను పోషించారు. ఇతర ముఖ్య పాత్రల్లో భూమిక, సుమంత్, తరుణ్ భాస్కర్‌లు కనిపించనున్నారు. ప్రేమకథలకు స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన హను రాఘవపూడి ఈ లవ్ స్టోరీని యూత్‌ను మెప్పించేలా తెరకెక్కించినట్టు సమాచారం.