శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (17:29 IST)

'విష్ణు అన్నా నీ మాటలు నాకు ఎంతో విలువైనవి' : నిఖిల్ సిద్ధార్థ్

Karthikeya 2
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రం "కార్తికేయ-2". ఈ చిత్రం టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. గతంలో తెరకెక్కి, మంచి విజయం అందుకున్న ‘కార్తికేయ’కి కొనసాగింపు చిత్రమే ‘కార్తికేయ 2’. పార్ట్‌ 1కు దర్శకత్వం వహించిన చందూ మొండేటినే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 
 
ద్వారకా నగర రహస్యాన్ని ఛేదించే కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. అనుపమ ఖేర్‌, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాల భైరవ సంగీతం అందించారు. పలుమార్లు వాయిదా ఈ సినిమా ఈ నెల 12న విడుదలకు సిద్ధమైంది. 
 
అయితే, ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేసిన తర్వాత మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షుడు, సినీ హీరో మంచు విష్ణు మాట్లాడుతూ, ‘నీకు నేనున్నా’ అంటూ నిఖిల్‌ సిద్ధార్థ్‌కు భరోసానిచ్చారు. ధైర్యంగా ఉండండి. మంచి కంటెంట్‌ ఎప్పుడూ విజయం సాధిస్తుందంటూ ‘కార్తికేయ 2’ టీమ్‌కు విష్ణు అండగా నిలిచారు. ఆ చిత్రం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. 
 
ఆ తర్వాత విష్ణు చేసిన ట్వీట్‌కు నిఖిల్‌ బదులిచ్చారు. 'విష్ణు అన్నా నీ మాటలు నాకు, 'కార్తికేయ 2' చిత్ర బృందానికి ఎంతో విలువైనవి' అని ఆనందం వ్యక్తం చేశారు. సినిమా ప్రచారంలో భాగంగా నిఖిల్‌ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ‘కార్తికేయ 2’ విడుదల వాయిదాపై ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే విష్ణు ట్వీట్‌ చేశారని తెలుస్తోంది.