శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జులై 2022 (15:18 IST)

మంకీపాక్స్ అంటే ఏమిటి.. దాని లక్షణాలు ఏంటి?

monkeypox
మంకీపాక్స్ అంటే ఒక వైరస్ కలిగే జూనోటిక్ ఇన్ఫెక్షన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది జంతువుల నుంచి మనషులకు వ్యాపించే వైరస్. అలాగే, ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కూడా వ్యాపిస్తుంది. 
 
ఈ మంకీపాక్స్ లక్షణాలను పరిశీలిస్తే, ఈ వైరస్ సోకిన వ్యక్తిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, తక్కువ శక్తి, శోషరస గ్రంథులు వాపు వంటివి కనిపిస్తాయి. ఇవి అత్యంత సాధారణ లక్షణాలు.
 
వీటిలో అత్యంత ప్రధానమైన లక్షణం ఏంటంటే... ఈ వైరస్ సోకిన వ్యక్తికి రెండు నుంచి మూడు వారాల్లో శరీరం అంతటా దద్దుర్లు లేదా బొబ్బలు వస్తాయి. దద్దుర్లు ముఖం, అరజేతులు, పాదాల అరికాళ్లు, కళ్లు, నోరు, గొంతు, గజ్జలు, శరీరంలోని జననేంద్రియాలు, పిరుదుల ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి. 
 
ఈ వైరస్ సోకిన వ్యక్తిని క్వారంటైన్‌లో ఉంచడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. అలాగే, కలుషితమైన పరిసరాలను శుభ్రపరచడం, క్రిమిసంహారకం చేయడం అవసరం. మంకీపాక్స్ ఉందని భావిస్తే వైద్య సలహాను తీసుకోవాలి. అనుమానం ఉంటే వైద్యులు పరీక్షించి వ్యాధి లేదని చెప్పేంతవరకు మిగిలినవారికి దూరంగా ఉండటం చాలా మంచిది.