సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (23:15 IST)

పశ్చిమ బెంగాల్‌లో భారీ స్కామ్.. కోట్లు చేతులు మారాయా.. డబ్బే డబ్బు!

Money
Money
పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల నియామకం చేపట్టే క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సోదాలు చేపట్టింది. 
 
బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ (గతంలో విద్యాశాఖ మంత్రి) సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నివాసంలో ఈడీ జరిపిన సోదాల్లో డబ్బు గుట్టలు గుట్టలుగా బయటపడింది. ఈ మొత్తం రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 
 
అటు, పార్థ ఛటర్జీ నివాసంతో పాటు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి పరేష్ అధికారి నివాసంలోనూ ఈడీ అధికారులు సోదా చేశారు. బెంగాల్ వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు జరిగాయి. 
Money
Money
 
ఇదే అదనుగా బీజేపీ నేతలు టీఎంసీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. డబ్బు, బిర్యానీ పంచి ప్రజలను సమీకరిస్తూ ప్రతిసారి మోసం చేయలేరని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేర్కొన్నారు.