శృంగారంపై పెదవి విప్పరు.. కానీ పిల్లలను ఒక ఫ్యాక్టరీలా కనేస్తున్నారు : వరలక్ష్మి
కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంతానంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శృంగారంపై మాత్రం ఏ ఒక్కరూ మాట్లాడరని, కానీ పిల్లలను మాత్రం ఓ ఫ్యాక్టరీలో కనేస్తున్నారని, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని బాధపడతారని చెప్పుకొచ్చారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని జనాభా నియంత్రణకు, ఆర్థిక స్థోమతకు ముడిపెడుతూ కామెంట్స్ చేశారు.
మన దేశంలో సెక్స్ గురించి ఎవరూ మాట్లాడరు. కానీ, జనాభాలో మాత్రం మనం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. పిల్లలను ఒక ఫ్యాక్టరీలో కనేస్తున్నారు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు అంటూ బాధపడుతారు. పిల్లలను కనేముందు సరైన్ ప్లాన్ ఉండాలి కదా అని అన్నారు.
ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక బిడ్డను పెంచి, చదివించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, అందుకే ఇంకొకరిని పోషించే స్తోమత ఉన్నపుడే పిల్లలను కనాలని ఆమె సూచించారు. అయితే, ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలావుంటే, ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతి ఒక్కరూ ముగ్గురేసి పిల్లలను కనాలని పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.
