1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

నేడు రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు... ముర్ముకే అవకాశం!

president bhavan
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 18వ తేదీన ఎన్నికల ఓటింగ్ జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటల లోపు ఈ లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత తుది ఫలితాన్ని వెల్లడిస్తారు.
 
అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన ద్రౌపది ముర్ముకే అధిక అవకాశాలు ఉన్నాయి. విపక్షాల తరపున పోటీ చేసిన బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా రేసులో ఉన్నప్పటికీ ఆయన విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల ఫలితం లాంఛనప్రాయం కానుంది. 
 
కాగా, ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఓట్ల లెక్కింపు పార్లమెంట్ భవనంలో ప్రారంభమవుతుంది. తొలుత ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఆల్ఫాబెట్ ఆర్డరులో ఒక్కో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్లను లెక్కిస్తారు. దీంతో తొలుత ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఓట్లను లెక్కిస్తారు. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితాన్ని వెల్లడిస్తారు.