బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జులై 2022 (16:43 IST)

యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ ఘన స్వాగతం.. రేవంత్ రెడ్డికి షాక్

Yashwant Sinha
Yashwant Sinha
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చారు. సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ ఘన స్వాగతం పలికింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు స్వాగతం చెప్పారు. 
 
తెలంగాణ మంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. తర్వాత బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జలవిహార్ వరకు టీఆర్ఎస్ పార్టీ భారీ బైక్, కారు ర్యాలీ నిర్వహించింది.  
 
యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తోంది. ఆయన నామినేషన్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. కాని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం యశ్వంత్ సిన్హాకు సంబంధించి శనివారం కీలక ప్రకటన చేశారు. 
 
రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వస్తున్న యశ్వంత్ సిన్హాను కలవబోమని చెప్పారు. ఈ గోడమీద వాలిన కాకి ఆ గోడ మీద వాలదూ అంటూ పరోక్షంగా టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్న సిన్హాతో తాము కలిసేది లేదని చెప్పారు. 
 
అయితే హైదరాబాద్‌కు వచ్చిన యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ స్వాగత కార్యక్రమంలో ఆసక్తికర ఘటన జరిగింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లవద్దని ఆదేశాలు ఇచ్చినా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చి యశ్వంత్ సిన్హాకు స్వాగతం తెలిపారు. 
 
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఎయిర్ పోర్టుకు రావడమే కాదు.. సీఎం కేసీఆర్‌తో కలిసి యశ్వంత్ సిన్హాను కలిశారు. ఈ ఘటన ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.