ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (09:21 IST)

రాష్ట్రపతి ఎన్నికలు : నేడు యశ్వంత్ సిన్హా నామినేషన్

Yashwant Sinha
రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్ష నాయకులు జూన్ 27 ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ అనెక్స్‌లో సమావేశం కానున్నారు. 
 
ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తదితరులు హాజరుకానున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఎన్సీపీ, బీజేపీ వ్యతిరేక పార్టీలు యశ్వంత్ సిన్హాకు మద్దతు పలుకుతున్నాయి. ఆ తర్వాత విపక్ష నేతలతో కలిసి ఆయన నామినేషన్‌ను సమర్పిస్తారు. 
 
కాగా, యశ్వంత్ సిన్హా పాట్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి 1960లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.1986లో జనతా పార్టీలో చేరి 2018లో బీజేపీని వీడి టీఎంసీలో చేరారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.