కుంటుతూ నడిచిన ప్రభాస్ ఎందుకో తెలుసా!
ప్రభాస్ బుదవారం రాత్రి సీతారామం ప్రి రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. మామూలు ఆయన రాకను ఫొటోగ్రాఫర్లు అందరూ కవర్ చేస్తారు. వీడియోలు తీస్తారు. కానీ ఈరోజు అది సాద్యపడలేదు. బ్లాక్ కారులో వచ్చిన ప్రభాస్‌ను చుట్టూ బౌనర్సర్లు, పర్సనల్ సెక్యూరిటీ గార్డులతోపాటు అశ్వనీదత్‌గారి టీమ్ అంతా ఆయన్న చుట్టుముట్టారు. ఎక్కడా ఫొటోను లీక్ చేయకుండా చేయాల్సివచ్చింది.
ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవలే విదేశాలకు వెళ్ళి వచ్చారు ప్రభాస్. తన కాలికి ఏర్పడిన గాయం వల్ల శస్త్ర చికిత్స చేయించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఇటీవలే అశ్వనీదత్ కూడా వెల్లడించారు. ఆయన రాగానే మా ఫంక్షన్‌కు వస్తాడని తెలిపారు. అనుకున్నట్లుగానే ప్రభాస్ వచ్చారు. కాస్త కుంటుతూ నడవడం కనిపించింది. దీన్ని సోషల్ మీడియాలో తెగ వైర్ చేసేస్తున్నారు.