శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 జులై 2022 (19:45 IST)

ప్రభాస్ కాలికి గాయం... సర్జరీ కోసం స్పెయిన్?

Prabhas
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ కాలికి గాయమైనట్టు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సాలార్ చిత్రం షూటింగులో ఆయన గాయపడినట్టు సమాచారం. దీంతో ఆయన సర్జరీ చేయించుకోవాలని అపుడే వైద్యులు సలహా ఇచ్చారు. కానీ, 'రాధేశ్యామ్' ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో ఆయన సర్జరీ చేయించుకోలేదు. ఇపుడు గాయం తిరగదోడింది. దీంతో గాయానికి సర్జరీ కోసం స్పెయిన్‌కు వెళ్లినట్టు ఆయన సన్నిహితుల వర్గాల సమాచారం. దీంతో పది రోజుల పాటు ప్రభాస్ పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నట్టు సమాచారం. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం ప్రభాస్ లిస్టులో అందరి ఫోకస్ ఎక్కువగా 'సలార్' సినిమా పైనే ఉండేది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఆదిపురుష్" రామాయణం కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాబట్టి ఈ సినిమా ఎంతవరకు మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో చెప్పలేం. ఇక ఆ తర్వాత ప్రాజెక్టు "K", "స్పిరిట్" సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చేసరికి మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.