శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (14:07 IST)

ప్రభాస్ నాకు గుర్తుండిపోయే ట్రీట్ ఇచ్చాడు: దిశా పటాని

Disha-Prabhas
ప్రభాస్‌ను పొగడ్తల వర్షంతో ముంచేస్తోంది బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రం షూటింగులో జాయిన్ అయిన ఈ బ్యూటీ, ప్రభాస్ తనను ఆశ్చర్యంలో ముంచెత్తారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేసింది.

 
తన ఇంటి నుంచి భోజనం తెప్పించి స్వయంగా వడ్డించాడట. టాప్ స్టార్ అయినా ఇంత సింప్లిసిటీని ఎవ్వరిలో చూడలేదంటూ కితాబిస్తోంది. నిజంగా తన జీవితంలో గుర్తిండిపోయే ట్రీట్ ఇచ్చాడంటూ ప్రశంసిస్తోంది దిశా పటాని.

Disha patanni
ప్రభాస్ సింప్లిసిటీని గతంలో శ్రద్ధా కపూర్, కరీనా కపూర్ కూడా మెచ్చుకున్నారు. కొత్తగా ఈ లిస్టులో ఇప్పుడు దిశా పటాని చేరిపోయింది.