ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్!
Prabhas
పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇందులో ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా పలువురు పేర్లు పరిశీలనలో వున్నాయి. ఫైనల్‌గా కరీనా కపూర్ పేరు చిత్ర యూనిట్ పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ సినిమా పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరీనా కపూర్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం తన తొలి వెబ్ సిరీస్ షూటింగ్‌లో ఉన్నారు. అది పూర్తయ్యాక ఆమె డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.
