శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (18:03 IST)

త‌క్కువ ధరకే టిక్కెట్ - ఇప్పట్లో పక్కా కమర్షియల్ ఓటిటిలో రాదు- బన్నీ వాసు, మారుతి

Bunny Vasu, Maruti
Bunny Vasu, Maruti
మేం నిర్మించిన అ పక్కా కమర్షియల్ చిత్రాన్ని అద‌రూ చూడాల‌నే త‌క్కువ రేటుకే థియేట‌ర్‌ల‌లో విడుద‌ల చేస్తున్నామ‌ని, ఓటీటీలో చూద్దాం అన్నా ఇప్ప‌ట్లో కుద‌రద‌ని.. చిత్ర నిర్మాత బన్నీ వాసు, ద‌ర్శ‌కుడు మారుతి తెలియ‌జేస్తున్నారు. గోపీచంద్‌, రాశీఖ‌న్నా న‌టించిన ఈ సినిమా జూలై1న విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా వారు విలేక‌రుల‌తో ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు. 
 
దర్శకుడు మారుతి  మాట్లాడుతూ, నా ప్రివియస్ సినిమాల మాదిరే ఈ సినిమాలో కూడా మంచి ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ ను పెట్టుకుంటూ కమర్సియల్ ఎలిమెంట్స్ ఎక్కడా మిస్ కాకుండా ఫైట్స్, పాటలు ఇలా అన్ని రకాలుగా ఉండేలా ప్లాన్ చేసుకొని ఈ సినిమా చెయ్యడం జరిగింది.
చిరంజీవి గారు మా ప్రి రిలీజ్ ఈవెంట్ కు రావడంతో మా సినిమా ఎంతో మందికి రీచ్ అయ్యింది. గోపీచంద్ గత సినిమాలు మాదిరె ఈ సినిమా కూడా ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది.. నేను ఎప్పుడూ డైరెక్టర్ అవుతాను అనుకోలేదు. కానీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయ్యాను. మూడు హిట్స్ ఇవ్వగానే పెద్ద హీరోలకు కథలు వినిపించి వారితోనే సినిమాలు చెయ్యాలనుకోను వారితో చేసినా చిన్న సినిమాలను వదులుకోను. చిన్న సినిమాలో దర్శకుడు గా అవకాశం వచ్చినా ఆది పెద్ద ఆఫర్ గా భావిస్తాను. ఈ ఇండస్రీ ఎంతో మంది దర్శకులను చూసింది.మనం ఎంతో మంది గొప్ప దర్శకులనుండి ఎంతో నేర్చుకోవాలి.ఈవివి, గారు, 
 
దాసరి గారు ఇలా ఇలా చాలామంది దర్శకులు పెద్ద సినిమాలు చేసి హిట్ ఇచ్చినా, చిన్న సినిమాలను మరువకుండా  వాటిని కాపాడుకుంటూ వచ్చారు. అలాంటి గొప్ప దర్శకుల నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి కాబట్టి నా విషయంలో పెద్ద సినిమాలు చేసినా చిన్న సినిమాలు చేస్తూనే ఉంటాను అన్నారు.
 
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. "పక్కా కమర్సియల్" సినిమా రిలీజ్ అవ్వడానికి అన్ని విధాల కార్యక్రమాలు రెడీ అయ్యాయి. భలే భలే మగాడివోయ్, ప్రతి రోజూ పండగే ఇలా తన సినిమాలు ఏవి తీసుకున్నా కూడా మారుతీ నిర్మించిన ఏడు సినిమాలకు కూడా ఎంటర్ టైన్మెంట్ ఫస్ట్ ప్రిపరన్స్ ఇస్తారు.   ప్రేక్షకులకు గ్యారెంటీ ఇచ్చేది ఏంటంటే మీరు హ్యాపీగా ఫ్యామిలీ తో సినిమాకు రండి టికెట్స్ కూడా మీకు అనుకూలంగానే తీసుకువచ్చాము. నైజాం లో కూడా చాలా థియేటర్స్, మల్టీప్లెస్ లలో రిలీజ్ చేస్తున్నాము. తీసిన సినిమాలలో కెల్లా ఈ సినిమా కంటే ఇందులో యాక్షన్ చూయించాడు. అందరికీ తగిన ధరలు అంటే సిటీ 150, రూరల్ లో 110 రూపాయలకే  మా సినిమా టికెట్స్ ఉంటాయి. ఇలా ఎందుకు చేస్తున్నాము అంటే కరోనా తరువాత ఫ్యామిలీ తో అందరూ వచ్చి హ్యాపీగా ఎంటర్ టైన్ అవుతారని తీసుకున్న నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ లో ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి కాబట్టి ఆక్కడకూడా ఎటువంటి ఎక్స్ రేట్స్ లేకుండా ఈ సినిమాను రిలీజ్ చేయడం జరుగుతుంది.అయితే మా సినిమాను చాలామంది ఓటిటి లో చూద్దాం అనుకుంటు న్నారేమో కానీ ఇప్పట్లో ఈ సినిమా ఓటిటి లో రాదు. కాబట్టి మీరందరూ మా సినిమాను చూసి ఆశీర్వదిస్తే ఇంకా వచ్చే సినిమాలతో ఇండస్ట్రీ ముందుకు వెళుతుంది. కరోనా తర్వాత సమస్యల లో ఉన్న ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది.కాబట్టి అందరూ సపోర్ట్ చెయ్యాలని కోరుతున్నాను అన్నారు.