సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (09:43 IST)

ప్ర‌భాస్‌, అనుష్క కాంబినేషన్‌ను సెట్ చేస్తున్న ద‌ర్శ‌కుడు!

Anushka,Prabhas
Anushka,Prabhas
అత‌ను మొద‌ట్లో అల్ల‌రిచిల్ల‌రి సినిమా తీశాడు. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ ఇలానే వుంటుందంటూ త‌న ఆలోచ‌న‌లు, అనుభ‌వాల‌నుంచి తీసి సక్సెస్ సాధించాడు. అలా కొన్ని సినిమాలు తీశాక గీత ఆర్ట్స్‌లో గ‌పీచంద్‌తో సినిమా చేసేశాడు. తాను తీసింది ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అంటూ ధైర్యంగా చెబుతూ టైటిల్ పెట్టాడు. జూలై1 విడుద‌ల కాబోతున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆయ‌న ఓ భారీ ప్రాజెక్ట్ గురించి సూచాయిగా వెల్ల‌డించారు.
 
ఈసారి ఏకంగా ప్ర‌భాస్‌ను టార్గెట్ చేశాడు. అందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇప్ప‌ట్లోకాదు. ఇప్ప‌టికే భారీ సినిమాల‌ను టాక్ చేసుకున్న ప్ర‌భాస్ వ‌చ్చే ఏడాది మారుతీతో చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఇందులో క‌థ‌కు ముగ్గురు హీరోయిన్లు వుంటార‌ట‌. అందులో అనుష్క త‌ప్ప‌నిస‌రి అంటూ త‌న మ‌న‌సులోని మాట‌ను వెల్ల‌డించారు మారుతీ. ఈ కాంబినేష‌న్‌లో భారీ నిర్మాణ సంస్థ తీయ‌డానికి సిద్ధ‌మైంది. అనుష్క‌, ప్ర‌భాస్‌ను మ‌ర‌లా క‌లిపే క్రెడిట్ త‌న‌కే రావాల‌ని మారుతీ తెలివిగా ఆలోచించాడు. అందుకు ప్ర‌భాస్‌, అనుష్క‌ సంసిద్థ‌త‌ను వ్య‌క్తం చేసిన‌ట్లు స‌న్నిహితులు తెలియ‌జేస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్క‌నుంది.