భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న కవిత - త్వరలోనే రాజకీయ పార్టీ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాల కల్వకుంట్ల కవిత శుక్రవారం తన భర్త కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, త్వరలోనే రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. గత నాలుగేళ్లుగా తాను పడుతున్న మనో వేదన వెంకటేశ్వర స్వామి వారి దయతో తీరిందన్నారు. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఆమెకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
దీంతో ఆమె తన భర్తతో కలిసి శ్రీవారికి మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు కాలి నడకన వచ్చారు. ఆ తర్వాత శుక్రవారం వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ముందుగా గురువారం ఆమె హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి విమానంలో చేరుకుని అక్కడ నుంచి కారులో తిరుపతికి చేరుకున్నారు. ఆ తర్వాత అలిపిరి నుంచి తిరుమల వరకు కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.