గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (10:53 IST)

గోపీచంద్‌తో భగవాన్, జె పుల్లారావు చిత్రం ప్రకటన

Gopichand
Gopichand
హీరో గోపీచంద్ ఆసక్తికరమైన కథలని ఎంచుకుంటున్నారు. డిఫరెంట్ జానర్ సినిమాలను ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు గోపీచంద్ బర్త్ డే. ఈ సందర్భంగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. జె భగవాన్, జె పుల్లారావు నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నారు గోపిచంద్.
 
గోపీచంద్‌తో శంఖం, గౌతమ్ నంద చిత్రాలను రూపొందించిన నిర్మాతలే మూడో సినిమాకి శ్రీకారం చుట్టారు. జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్ (జడ్డు బ్రదర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్) పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించిన నిర్మాతలు ఈ బ్యానర్ నుండి  ప్రొడక్షన్ నంబర్ 2 గోపీచంద్‌ సినిమాని తెరకెక్కించనున్నారు.
 
ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాకు ఓ మాస్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నారు, దర్శకుని పేరును త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం శ్రీవాస్‌ తో ఓ చిత్రం చేస్తున్నారు  గోపీచంద్. శ్రీవాస్ తో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.