సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 9 జులై 2022 (13:20 IST)

ప్రభాస్ పారితోషికం రూ. 120 కోట్లు, ఆ డబ్బుతో ఏం చేస్తున్నాడో తెలుసా?

Prabhas latest ph
రెబల్ స్టార్ ప్రభాస్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా రికార్డు సృష్టిస్తున్నాడు. ఒక్కో సినిమాకి రూ. 120 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. బాహుబలి చిత్రంతో ప్రపంచ స్థాయి నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ కాల్షీట్ల కోసం బడా ప్రొడ్యూసర్స్ క్యూలో వున్నారు.

 
కాగా ప్రభాస్ చేతిలో 5 ప్రాజెక్టులున్నాయి. ఆ ప్రకారం ఈ 5 సినిమాలకే రూ. 600 కోట్లు వచ్చేస్తాయి. ఈ డబ్బుతో ప్రభాస్ ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చిన డబ్బునంతా హోటల్ బిజినెస్ లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.

 
ముఖ్యంగా స్పెయిన్, దుబాయ్ దేశాల్లోని హోటల్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రభాస్ ఆసక్తి చూపిస్తున్నారట.