మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 జులై 2022 (12:35 IST)

నా కళ్ల ముందే చాలా మంది కొట్టుకుపోయారు.. రాజాసింగ్‌

rajasingh
జమ్మూకాశ్మీర్‌లోని అమర్‌నాథ్‌లో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. దీంతో, వదరలు విరిచుకుపడ్డాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.. సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు క్షతగాత్రులను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు చర్యలు కొనసాగిస్తున్నాయి.
 
ఇక, అమర్‌నాథ్‌ యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా ఉన్నారు. అమర్‌నాథ్ యాత్రకు బయల్దేరిన వెళ్లిన రాజా సింగ్ కుటుంబం వెనుదిరిగింది. అయితే, అమర్‌నాథ్‌లో మంచు శివ లింగాన్ని దర్శించుకున్నట్లు రాజా సింగ్ తెలిపారు. 
 
గత 3 రోజులుగా అమర్‌నాథ్ మార్గంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపిన ఆయన.. హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం కావాలని భావించామని.. కానీ, అననుకూల వాతావరణం నేపథ్యంలో గుర్రాలపై తిరుగు ప్రయాణం అయినట్టు వెల్లడించారు.
 
ఇక, వరదలపై ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారిగా వరద వచ్చింది, నా కళ్ల ముందే చాలా మంది కొట్టుకుపోయారని రాజాసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.