గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 జులై 2022 (20:50 IST)

45 మందితో షిండే కొత్త కేబినెట్.. బీజేపీ నుంచి 25 మంది ?

eknath shinde
శివసేనకు చెందిన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ నాయకత్వంతో జతకట్టి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టి.. అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలో బీజేపీ, శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ రాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేశారు.
 
కాగా, 45 మంది మంత్రులతో నూతన కేబినెట్‌ను షిండే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే మొత్తం 45 మందితో కొలువుదీరే మంత్రివర్గంలో బీజేపీ నుంచి 25 మంది మినిస్టర్లుగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.