బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 27 జులై 2022 (16:22 IST)

హీరోల ద‌గ్గ‌ర‌కు స‌మ‌స్య‌లు తీసుకెళ్ళేవారు లేరు - దిల్‌రాజు (లేటెస్ట్‌న్యూస్‌)

Dil Raju, Ram Charan
Dil Raju, Ram Charan
సినిమారంగంలో హీరోల‌దే పైచేయి. ఏ నిర్మాతైనా త‌మ సినిమాకు హీరోను బుక్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తారుకానీ, అస‌లు స‌మ‌స్య‌లుంటే హీరో ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్ళేవారు లేర‌ని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు తేల్చిచెప్పారు. గ‌తంలోనే హీరో పారితోషికాలు పెరిగిపోతున్నాయ‌ని అన్నారు. కానీ ఎవ‌రు ధైర్యంగా వెళ్ళి హీరోల‌తో మాట్లాడ‌గ‌ల‌రు చెప్పండంటూ... మీడియాను ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు.
 
ఇప్పుడు చిత్ర నిర్మాణ వ్య‌యం బాగా పెరిగింది. థియేట‌ర్ల‌కు జ‌నాలు రావ‌డంలేదు. ఓటీటీలో సినిమా వ‌చ్చేస్తుంది. ఇంకేం చూస్తామ‌నే ధోర‌ణిలో ప్రేక్ష‌కులు వున్నారు. వారి అంచ‌నాల‌కు మించిన క‌థ‌లు తీయాలి అంటూ దిల్‌రాజు తాజాగా వ్యాఖ్యానించారు. థియేట‌ర్ల‌కు జ‌నాలు ఎందుకు రావ‌డంలేద‌నే విష‌య‌మై ఇటీవ‌లే నేను రామ్‌చ‌ర‌ణ్‌తో మాట్లాడాను. పారితోషికాల గురించి చ‌ర్చించాం. ఆయ‌న ఏమ‌న్నారో తెలుసా! మా ద‌గ్గ‌ర‌కు ఇలా చిత్ర నిర్మాణ వ్య‌యం పెరుగుతుంది. హీరోలు త‌గ్గించుకోండ‌ని చెప్ప‌లేదు. చెప్పినందుకు మీకు థ్యాంక్స్ అని రామ్‌చ‌ర‌ణ్ అన్నాడ‌ని దిల్‌రాజు తెలిపారు.
 
తాజా ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే, యువ హీరోల‌తో దిల్‌రాజు మాట్లాడి, వారి పారితోషికాల‌ను త‌గ్గించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇవ‌న్నీ అయ్యేస‌రికి స‌మ‌యం ప‌డుతుంది. మ‌రోవైపు ఓటీటీ స‌మ‌స్య‌, కార్మికుల జీతాల పెంపుద‌ల వంటి అంశాల‌న్నీ నాయ‌కుల‌తో చ‌ర్చిస్తాం. అందుకు వారం ప‌ట్ట‌వ‌చ్చు. నెల ప‌ట్ట‌వ‌చ్చు అని తేల్చి చెప్పారు.