సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (20:20 IST)

ఆగ‌స్టు నుంచి షూటింగ్‌లు బంద్‌- స‌ర్వీసింగ్ చేయాల‌న్న పెద్ద‌లు

shootings bundh
shootings bundh
బండికి స‌ర్వీసింగ్ చేసిన‌ట్లే ఇప్పుడు సినిమా రంగానికే స‌ర్వీసింగ్ చేసే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఎప్ప‌టినుంచో వినిపిస్తున్న షూటింగ్‌లు బంద్ అనేది నిజ‌మైంది. మంగ‌ళ‌వారంనాడు ఛాంబ‌ర్‌లో జ‌రిగిన నిర్మాత‌ల గిల్డ్ (రెగ్యుల‌ర్‌గా సినిమాలు తీసే 12మంది నిర్మాత‌లు ఏర్పాటు చేసుకున్న సంఘం) స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.అయితే ఈ నిర్ణ‌యంపై ఫిలీం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌, 24 కార్మిక సంఘాలు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 
 
guild letter
guild letter
కార‌ణం ఇదే
ఇలా షూటింగ్‌లు బంద్‌లు చేయ‌డానికి కార‌ణం. థియేట‌ర్ల‌కు జ‌నాలు రాక‌పోవ‌డంతోపాటు నిర్మాణ‌వ్య‌యం పెరిగిపోతుంది. హీరో, హీరోయిన్లు, ఇత‌ర సాంకేతిక సిబ్బంది పారితోషికాలు ఎక్కువ‌గా వున్నాయి. కార్మికులు క‌నీస వేతం కొంచెం పెంచాల‌ని అడిగినందుకే షూటింగ్‌లు బంద్ చేస్తామ‌ని అప్ప‌ట్లో సి.క‌ళ్యాణ్ ప్ర‌క‌టించాడు. వెంట‌నే త‌డుముకుని.. కార్మికులు లేనిదే సినిమా లేదంటూ.. కాస్త వ‌స‌మ‌యం ప‌డుతుంది స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అన్నారు. 
అయితే ఇది కేవ‌లం మ‌న స‌మ‌స్య‌లు చ‌ర్చించుకునేందుకే షూటింగ్‌లు బంద్ చేస్తున్నామ‌నీ, అంద‌రూ క లిసి కూర్చుని చ‌ర్చించాల‌ని గిల్డ్ లెట‌ర్‌లో పేర్కొంది.
 
దిల్‌రాజు.. ఏం చేశాడంటే..
దిల్‌రాజుపైనే ఇండ‌స్ట్రీ బాధ్య‌త పెట్టింది. సినిమా గిల్డ్‌లో కీల‌క వ్య‌క్తి దిల్‌రాజు. త‌న‌కు సాయం చేసిన‌వారికి థ్యాంక్స్ చెప్పేందుకే థ్యాంక్‌యూ అనే సినిమా తీశాన‌ని చెప్పిన దిల్‌రాజు.. కార్మికుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి థ్యాంక్స్ చెప్పించుకోండ‌ద‌ని ఓ విలేక‌రి అడిగితే.. న‌వ్వే స‌మాధానంగా చెప్పారు. ఇప్పుడు ఫైన‌ల్‌గా ఆగ‌స్టు 1నుంచి టెంప‌ర‌రీ షూటింగ్‌లు బంద్ అన్నారు.. ఈ ప్ర‌భావం వంద‌లా సినిమాల షూటింగ్‌ల‌పై ప్ర‌భావం చూపుతుంది.
 
వాతావ‌ర‌ణం కూడా అనుకూలించ‌లేదు
ఇదిలా వుండ‌గా, వ‌రుస‌గా వ‌ర్షాలు ప‌డ‌డంతో చాలాచోట్ల షూటింగ్ చేయాలంటే అడ్డంకిగా మారింద‌ని, ఇలా కాస్త షూటింగ్‌ల‌కు గేప్ ఇవ్వ‌డం కూడా క‌రెక్టేన‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏది ఏమైనా.. త్వ‌ర‌లో మ‌ర‌లా షూటింగ్‌లు జ‌ర‌గుతాయ‌ని సీనియ‌ర్ నిర్మాత తెలియ‌జేస్తున్నాడు.