బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (14:55 IST)

ఔన్‌డోర్ షూటింగ్‌లోనే ప్రేక్ష‌కుల ప‌ల్స్ తెలుస్తుంది - అక్కినేని నాగచైతన్య

Naga Chaitanya
Naga Chaitanya
అక్కినేని నాగ చైత‌న్య హీరోగా దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ అసోసియేష‌న్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేష‌న్‌తో శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 22న సినిమా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో అక్కినేని నాగ చైత‌న్య మీడియాతో మాట్లాడారు. ఆ ఇంట‌ర్వ్యూ విశేషాలు.. 
 
- థాంక్యూ సినిమా నాకు ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలెంజింగ్‌ సినిమా. అందరికీ ఇందులో మూడు షేడ్స్ లో ఉన్నట్టు కనిపిస్తాను. కానీ ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. 16 ఏళ్లు 20 ఏళ్లు, 2 5 ఏళ్లు, 30 ఏళ్లు, 36 ఏళ్లు ఇలా రకరకాల ఫేజెస్‌ చూపించాం.
 
- థాంక్యూ లాంటి స్క్రిప్ట్స్ దొరకడం చాలా కష్టం. డైరక్టర్లు సింగిల్‌ లుక్‌ ఉన్న సినిమాలే ఎక్కువగా చెబుతుంటారు. ఒకవేళ మార్పు ఉన్నా, ఫ్లాష్ బ్యాక్‌లో చిన్న మార్పు ఉంటుంది. అంతకు మించి చేంజెస్‌ ఉండవు.
 
- అలాంటిది 16 ఇయర్స్ నుంచి 36 ఏళ్ల వరకు త్రీ వేరియేషన్స్ లో కనిపించే స్క్రిప్ట్ రాగానే చాలెంజింగ్‌గా అనిపించింది. అందుకే టేకప్‌ చేశాను. ఇప్పుడంటే టీనేజర్‌గా జనాలు చూస్తారు. ఇంకో మూడు, నాలుగేళ్ల తర్వాత నేను ఇలాంటి సినిమాలు చేస్తానంటే ఎవరూ పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు. అందుకే ఈ ప్రాజెక్ట్ టేకప్‌ చేశా.
 
- ప్రేమమ్‌లో నేను చేసింది  మనిషి జీవితంలో లవ్‌స్టోరీస్‌ వల్ల ఎలా ఇన్‌ఫ్లుయన్స్ అవుతాడు అనే కేరక్టర్‌. కానీ ఈ సినిమాలో ఒక వ్యక్తి జీవితంలో కలిసే వ్యక్తుల వల్ల ఎలా ప్రభావం చెందాడు అనేది ఇంపార్టెంట్‌.
 
- సినిమా ఓపెనింగ్‌, ఎండింగ్‌ అంతా 70 పర్సెంట్‌ దాకా అబ్రాడ్‌లోనే చేశాం. కొంత భాగం రాజమండ్రి, వైజాగ్‌ పరిసరాల్లో చేశాం.
 
- ఓపెన్‌ ప్లేసెస్‌లో షూటింగ్‌ చేయడానికి నేనెప్పుడూ ఇష్టపడతాను. అక్కడ షూటింగులు చేస్తున్నప్పుడు జనాలు కలుస్తారు. వాళ్ల అభిప్రాయాలు చెబుతుంటారు. ఎలాంటి సినిమాలను ఇష్టపడుతుంటారో డిస్కషన్‌ చేసుకోవచ్చు.
 
- ఈ సినిమా కోసం చాలానే తగ్గాను. ఈ సినిమా కన్నా ముందే లాల్‌సింగ్‌ చద్దా కోసం 25 కిలోలు తగ్గాను. అది ఈ సినిమాకు చాలా బాగా హెల్ప్ అయింది.
 
- బ్యాక్‌ టు బ్యాక్‌ లవ్‌స్టోరీ, థాంక్యూ, ధూత అన్నీ చేసేశా. ఇవన్నీ కోవిడ్‌ ముందే చేయాల్సింది. కానీ కోవిడ్‌ వల్ల కుదరలేదు. కోవిడ్‌ టైమ్‌లోనే లాల్‌సింగ్‌ చద్దా ఆఫర్‌ వచ్చింది. 
 
- ఆమిర్‌ చాలా మంచి టీచర్‌. ఆయన ఇలా చేయమని ఎప్పుడూ చెప్పరు. కానీ ఆయనతో మనం సమయం గడిపితే ఎలా చేస్తే బావుంటుందో అర్థమవుతుంది. చాలా నేర్చుకుంటాం.
 
- చిరంజీవిగారికి ప్రీమియర్‌ వేసినప్పుడు కూడా ఆమిర్‌ చాలా థ్రిల్‌ ఫీలయ్యారు. చిరంజీవిగారు మా సినిమాను సమర్పించడం చాలా ఆనందంగా ఉంది.
 
- థాంక్యూ మూవీలో అభిరామ్‌ జర్నీ గురించి విక్రమ్‌, రవి, దిల్‌రాజుగారు వచ్చి చెప్పినప్పుడు నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. విక్రమ్‌ సెన్సిబుల్‌ విషయాలను చాలా బాగా డీల్‌ చేస్తారు. 
 
- దిల్‌రాజుగారితో 12 ఏళ్ల తర్వాత సినిమా చేశాను. ఇంతకు ముందు కూడా ఆయన కాంపౌండ్‌  నుంచి చాలా కథలు విన్నా. కానీ ఈ సినిమా తప్పక  చేయాలనిపించింది.
 
- థాంక్యూ సినిమాతో వ్యక్తిగా నేను కూడా చాలా  మారాను. అంతకు ముందు మనసులో ఉన్న విషయాలను సగమే బయటకు చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీకి మరింత క్లోజ్‌ అయ్యాను. చాలా బాగా వాళ్లతో కలిసిపోతున్నాను.
 
- ఈ సినిమాలో రాశీ ఖ‌న్నా రోల్ చాలా కీల‌కం. త‌న వ‌ల్లే హీరో ప్రయాణం మొద‌ల‌వుతుంది. అలాగే మాళ‌వికా నాయ‌ర్ పాత్ర కూడా బావుంటుంది. అవికా గోర్ పాత్ర హీరోయిన్‌లా  కాకుండా సిస్ట‌ర్‌లా ఉంటుంది. 
 
-  థాంక్యూ మూవీ ఓ టైమ్ లైన్‌లో వెళుతుంటుంది. కాబ‌ట్టి ఆ ప‌ర్టికుల‌ర్ స‌మ‌యంలో తెలుగులో హిట్ సినిమాలేంట‌నే దాన్ని కూడా సినిమాలో చూపించాం. మ‌హేష్‌గారి ఒక్క‌డు, పోకిరి ఇలా డిఫ‌రెంట్ స్టేజెస్‌లో ఆయ‌న సినిమాల‌ను క‌వ‌ర్ చేసుకుంటూ వచ్చాం. 
 
- 16 ఏళ్ల కుర్రాడిగా క‌న‌ప‌డ‌టానికి నాకు ప్రొడ‌క్ష‌న్ వాళ్లు స‌పోర్ట్ చేసి మూడు నెల‌ల స‌మ‌యం ఇచ్చారు. ఆ స‌మ‌యంలో వ‌ర్క‌వుట్స్ చేయ‌టంతో పాటు బాడీ లాంగ్వేజ్ ప‌రంగా కొన్ని వర్క్ షాప్స్ కూడా చేశాను. నాకు అలాంటి ట్రాన్స‌ఫ‌ర‌మేష‌న్స్ అంటే చాలా ఇష్టం. ప్ర‌తి స్క్రిప్ట్‌లోనూ అది దొర‌క‌దు. ఈ సినిమాలో దొరికింది. చాలా ఎగ్జ‌యిట్ అయ్యే చేశాను. ఇప్పుడంటే నా శ‌రీరం కూడా స‌పోర్ట్ చేస్తుంది. మ‌రి ఫ్యూచ‌ర్‌లో కుదురుతుందో లేదో చూడాలి. 
 
- హిందీ ఆడియెన్స్ నన్ను యాక్సెప్ట్ చేయాలి. అలా చేస్తే అప్పుడు బాలీవుడ్ సినిమాల గురించి ఆలోచిస్తాను. ఇప్ప‌టికైతే బాలీవుడ్ సినిమాలేవీ ఒప్పుకోవ‌టం లేదు. 
 
- ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ సిట్యువేష‌న్స్ ప‌రంగా వెళుతుంటాయి. ప్రేమ‌మ్‌, ఏమాయ చేసావె స్టైల్లో ఉంటాయి. 
 
-  సినిమాలో ఏదో కొత్త విష‌యం ఉన్న‌ప్పుడే  ఆడియెన్స్ సినిమా థియేట‌ర్స్‌కు వ‌స్తున్నారు. ట్రైల‌ర్ చూసే సినిమాను చూడాలా వ‌ద్దా అని నిర్ణ‌యించుకుంటున్నారు. ఇప్పుడు సినిమాల ఎంపికలో నా మైండ్ సెట్ మారింది. సినిమాలో హీరో, డైరెక్ట‌ర్ అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే కంటెంట్ ఈజ్‌కింగ్ .
 
- దూత‌లో హీరోయిన్ లేదు. క్యారెక్ట‌ర్ బేస్ చేసుకుని ర‌న్ అవుతుంది. నేను డైరెక్ట‌ర్స్‌ని బాగా న‌మ్ముతాను. డైరెక్ట‌ర్ ఎంత బాగా చెబితే అంత బాగా న‌టిస్తాను. ఆడియెన్స్ న‌న్ను ల‌వ్ స్టోరీస్‌, ఎమోష‌న‌ల్ జ‌ర్నీస్ సినిమాల‌తో ఎంక‌రేజ్ చేశారు. దాంతో క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌కు సూట్ అవుతానా అనే సందేహం ఉంటుంది. గ‌తంలో యాక్ష‌న్ ట్రై చేస్తే వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ బంగార్రాజు చేశాను. అందులో నా క్యారెక్ట‌ర్ హై ఎన‌ర్జిటిక్‌గా ఉంటుంది. నాన్న ప‌క్క‌న చేయ‌టం అనేది చిన్న భ‌యం ఉంటుంది. 
 
- ఏజెంట్ ట్రైల‌ర్ చూశాను. అద్భుతంగా ఉంది. అఖిల్ త‌న లుక్ మార్చుకోవ‌టం కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో నాకు తెలుసు. ఏజెంట్‌తో త‌న‌కు మాస్‌, క‌మర్షియ‌ల్‌గా పెద్ద స‌క్సెస్ అఖిల్‌కి వ‌స్తుంద‌ని అనుకుంటున్నాను. 
 
- వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నేను చేస్తోన్న సినిమాలో నాది పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌. నా స్టైల్లో సాగే మాస్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ అది. సెన్సిబుల్ ఇంటెలిజెంట్ మూవీ. 
 
- మానాడు సినిమా చూడ‌గానే నాకు బాగా న‌చ్చేసింది. ఆ రైట్స్ అమ్మ‌లేమ‌నో ఏదో ఇష్యూస్ ఉంటాయ‌నడంతో వ‌దిలేశాను. మానాడు ముందు నుంచే వెంక‌ట్ ప్ర‌భుతో ట్రావెల్ అవుతున్నాను. ఇప్పుడు త‌న‌తో చేస్తున్న సినిమా మానాడు కంటే ముందుగానే చెప్పాడు. మానాడు రైట్స్ కోసం ట్రై చేశాను. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఇప్పుడు రానా తీసుకున్నాడు. 
 
- త‌రుణ్ భాస్క‌ర్ కూడా మంచి పాయింట్ చెప్పాడు. అది కూడా డిస్క‌ష‌న్‌లో ఉంది. 
 
- పరుశురామ్ గారి సినిమా స్టోరి ఇంకా లాక్ కాలేదు. ఓ పాయింట్ అనుకున్నాం.