గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (12:07 IST)

రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటోలు.. ఆర్జీవీ మద్దతు.. మగాళ్లు చేస్తే తప్పా?

Ram Gopal Varma
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవలే ఓ పేపర్ మ్యాగజైన్ కోసం న్యూడ్‌గా ఫొటోలకు ఫొజులిచ్చిన విషయం తెలిసిందే. ఆ ఫోటోల్లో రణవీర్ సింగ్.. శరీరం మీద నూలు పోగు లేకుండా దర్శనమిచ్చాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. 
 
రణ్‌వీర్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పలు మహిళ సంఘాలు, మహిళలు తీవ్ర విమర్శలు చేస్తూ, తాజాగా మహిళల మనోభావాలను కించపరిచాడని ముంబైలో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ క్రమంలో టాలీవుడ్ వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌కు మద్దతు పలికారు. "మహిళలు తమ శరీరాలను ప్రదర్శించగా లేనిదీ, పురుషులు ఆ పని ఎందుకు చేయకూడదు? మహిళలు తమ శృంగారాత్మక శరీరాలను చూపించినప్పుడు పురుషులు ఎందుకు చూయించకూడదు? మగవారిని భిన్న ప్రమాణాలతో చూడడం కపటం. మహిళలతో సమానంగా మగవారికీ హక్కులు ఉన్నాయి" అని రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు.