మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 16 జులై 2022 (13:51 IST)

మార్షల్ ఆర్ట్స్ కంటే పూజాభాలేక్క‌ర్ స్కిన్ షో హైలైట్ చేసిన వ‌ర్మ‌

Ladki Poojabhalekar
Ladki Poojabhalekar
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'అమ్మాయి'/'లడ్కీ' భారతదేశంలో ఒక మోస్తరు విమర్శకుల స్పందనను పొందింది. బ్రూస్ లీని స్పూర్తిగా తీసుకుని నివాళిగా ఇస్తున్న‌ట్లు ప్ర‌చారం చేసిన ల‌డ్కీ సినిమాలో నాయిక అంద‌చందాలే హైలైట్ చేశాడు వ‌ర్మ‌. ఆల్ రెడీ వ‌ర్మ‌కు వీరాభిమానిగా చెప్పుకొన్న పూజాభాలేక్క‌ర్ `రంగీలా` త‌ర‌హాలో సోలో డాన్స్‌, అందాలు చూపించ‌డంలో ఎక్కువ కేర్ తీసుకుంది. 
 
Ladki Poojabhalekar
Ladki Poojabhalekar
మార్షల్ ఆర్ట్స్ లో బ్రూస్‌లీ క‌నిపెట్టిన `జీత్ కునే దో` అని అది క‌రాటేలాగే వుంటున్నా అస‌లు క‌రాటేకాద‌ని ఇందులో వ‌ర్మ తెలియ‌జేశాడు. కానీ క‌థంతా పాత ఫార్మెట్‌. త‌న‌కు మార్షల్ ఆర్ట్స్ నేర్పే గురువును విల‌న్లు చంపేయ‌డం, వారినుంచి స్కూల్‌ను కాపాడుకోవ‌డ‌మేది క‌థ‌. ఇది టోనీజో చిత్రాల్లో వ‌చ్చిన క‌థే.
 
chaina-Bruslee statue
chaina-Bruslee statue
ఇక చైనాలో బ్రూస్‌లీ విగ్ర‌హం  వ‌ద్ద‌కు హీరో హీరోయిన్లు వెల్ల‌డం. అక్క‌డ కిస్‌లు చేసుకోవ‌డం వంటి సీన్స్‌ను వ‌ర్మ బాగానే పెట్టాడు. దీనిపై చాలామంది విమ‌ర్శిస్తున్నారు.  స్కిన్ షోపై ఆధారపడటం వల్లే 'అమ్మాయిస చిత్రంలో గంభీరత లేకుండా పోయిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. "పూజా భాలేకర్ బాడీకి సంబంధించిన క్లోజప్ షాట్‌లు, దాదాపు అన్ని డ్యాన్స్ సీక్వెన్స్‌లలోని స్కిన్-షోయింగ్ ఎలిమెంట్స్ హైలైట్ అయ్యాయ‌ని ఆర్జీవీ ని విమ‌ర్శిస్తున్నారు.
 
Poojabhalekar
Poojabhalekar
"అబ్జెక్టిఫైయింగ్ డైలాగ్‌లు, కస్ వర్డ్స్, క్లీవేజ,  పెల్విస్‌కి సంబంధించిన క్లోజప్ షాట్‌లను" తొలగించాలని  CBFC మేకర్స్‌ని కోరినట్లు తెలుస్తోంది.  ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే.. రీసెంట్ గా తన నుంచి వస్తున్న సినిమాల్లో ఫలితానికి దీనికి పెద్ద తేడా లేదని చెప్పాలి. సేమ్ అదే ఫార్ములా ట్రీట్మెంట్ రొటీన్ కథా కథనాలతో తాను సినిమాని నడిపించేసాడు. యాక్షన్ బ్లాక్ లు ఎక్కడో కొన్ని ఎమోషన్స్ తప్ప ఇక సినిమాలో చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. రంగీలా టైంకు ఇప్ప‌టికి యూత్‌లోనూ చాలా మార్పులు రావ‌డంతో ఇలాంటి స్కిన్‌షోను ఆదరిస్తారోలేదో చూడాల్సిందే.