శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జులై 2022 (15:29 IST)

సినీ నిర్మాత శేఖర్ రాజుపై ఫిర్యాదు చేసిన ఆర్జీవీ

ramgopal varma
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను వివాదాలతో పాటు చిక్కులు కూడా వీడటం లేదు. ముఖ్యంగా ఆయన నిర్మించే చిత్రాలు ప్రకటించిన తేదీల్లో విడుదల కాకుండా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన నిర్మించి "లడ్‌కీ : ఎంటర్ ది డ్రాగన్" చిత్రం కూడా కోర్టు చిక్కులు ఎదురుకావడంతో విడుదలకు నోచుకోలేదు. 
 
ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ హైదరాబాద్‌లోని సివిల్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో చిత్రం విడుదలకు నోచుకోలేదు. మరోవైపు, నిర్మాత శేఖర్ రాజుపై దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, శేఖర్ రాజే తనకు డబ్బులు ఇవ్వాలన్నారు. లఢ్‌కీ చిత్రంపై ఆయన తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదారి పట్టించారని ఆరోపించారు. శేఖర్ రాజుకు తాను ఇవ్వాల్సింది ఏమీ లేదని చెప్పారు. 
 
తప్పుడు సమాచారంతో తన సినిమాను నిలుపుదల చేయించిన శేఖర్ రాజుపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు. నినిమాపై ఆధారపడి ఎంతో మంది బతుకుతున్నారని సినిమా విడుదల కాకుండా ఆగిపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు.