గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జులై 2022 (13:40 IST)

దర్శకుడు వర్మకు సారీ చెప్పిన యాంకర్ శ్యామల

shyamala
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా నిర్మించిన చిత్రం "అమ్మాయి". హిందీలో "లడ్‌కీ". ఈ చిత్రం తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నగరంలో జరిగింది. ఫిల్మ్ నగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటరులో జరిగిన ఈ వేడుకలకు వ్యాఖ్యాతగా శ్యామల వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె దర్శకుడు ఆర్జీవీకి సారీ చెప్పారు. 
 
"సభను ఉద్దేశించి ఆర్జీవీ ప్రసంగించిన తర్వాత, యాంకర్ శ్యామల అతనిని కొన్ని ప్రశ్నలు అడిగారు, అందులో ఆమె తెలుగు టైటిల్స్‌ని అనువదించడం ద్వారా ఇంగ్లీష్ సినిమాల టైటిల్‌లను అంచనా వేయమని అడిగారు. ఇది ఆర్జీవీకి కోపం తెప్పించింది. 
 
ఆయన ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. పైగా, ఇప్పుడు చేయలేనని చెప్పాడు. ఆ తర్వాత యాంకర్ అతనికి క్షమాపణలు చెప్పింది. పూజా భలేకర్ సినిమాలో కథానాయికగా నటించి "అమ్మాయి" చిత్రం ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది.