మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 జులై 2022 (19:17 IST)

బెంగాలీ దర్శకుడు తరుణ్ మజుందార్ కన్నుమూత

Tarun Majumdar
Tarun Majumdar
ప్రముఖ బెంగాలీ దర్శకుడు తరుణ్ మజుందార్ కన్నుమూశారు. వయసు రీత్యా ఏర్పడిన  అనారోగ్య సమస్యలతో కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎమ్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు.

గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఈయనకు డాక్టర్లు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
ఇంతలోనే ఈయన అవయవాలేవి స్పందించకపోవడంతో ఈయన చనిపోయినట్టు డాక్టర్లు డిక్లేర్ చేశారు. 
 
ఈయన వయసు 92 సంవత్సరాలు. 1960 దశకంతో పాటు 70.80లలో ఈయన తెరకెక్కించిన చిత్రాలు బెంగాలీ చిత్రసీమలో సంచనలనం రేపాయి. 
 
ముఖ్యంగా ఈయన దర్శకత్వంలో తెరెక్కిన పాల్ తక్,  కుహెలి, బాలికా బధు, దాదర్ కీర్తి, శ్రీమాన్ పృథ్వీరాజ్ వంటి సినిమాలు అప్పటి తరం ప్రేక్షకులను అలరించాయి.