సీనియర్ నటి మీనా భర్త కన్నుమూత
సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూశారు. పోస్ట్ కోవిడ్ తదనంతర సమస్యల కారణంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లివర్ ఇన్‌ఫెక్షన్ వ్యాధితో అయితే విద్యాసాగర్ కొద్ది సంవత్సరాలుగా లివర్ ఇన్‌ఫెక్షన్ వ్యాధితో బాధపడుతున్నారు.
ఆయన ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయనకు ఈ వ్యాధి పావురాల మల, మూత్ర విసర్జన వల్ల సోకిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. కొద్ది నెలలుగా ఇన్‌ఫెక్షన్ తీవ్రం కావడంతో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు అని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.
మీనా దంపతుల కుటుంబం మొత్తం జనవరిలో కోవిడ్ వ్యాధి బారిన పడ్డారు. ఆ తర్వాత విద్యాసాగర్‌కు ఇన్‌ఫెక్షన్ మరింత పెరిగింది. కోవిడ్‌తో కోలుకొన్నప్పటికీ.. ఆయన ఆరోగ్యం మరింత విషమించింది అని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.