ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

విడాకులు తీసుకున్న భార్యను అత్యంత దారుణంగా చంపేసిన మాజీ భర్త

woman trashed
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఓ దారుణం జరిగింది. తన నుంచి విడాకులు తీసుకుని మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న మాజీ భార్యను మాజీ భర్త ఒకరు దారుణంగా చంపేశాడు. తనతో పాటు మరో నలుగురు వ్యక్తులతో కలిసి మాజీ భార్య చేతులు కాళ్ళు కట్టేసి భవనంపై నుంచి కిందకు విసిరేసి అత్యంత క్రూరంగా చంపేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలు ఇపుడు సోషల్ మీడియాలో వైరస్ అయ్యాయి. 
 
ఆగ్రాకు చెందిన రితికా సింగ్ అనే 30 యేళ్ల మహిళ తన భర్త ఆకాష్ గౌతమ్‌తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన స్నేహితుడుతో కలిసి తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటిలో సహజీవనం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ భర్త జీర్ణించుకోలేకపోయాడు. 
 
తనతో పాటు మరో నలుగురు స్నేహితులతో కలిసి ఆమె చేతులుకాళ్ళు కట్టేసి అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. ఈ దారుణం శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. దీంతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయినట్టు సీనియర్ ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ తెలిపారు. కాగా, ఈ దంపతులు గత 2014లో వివాహం చేసుకోగా, 2018లో చట్టబద్ధంగా విడిపోయారు. ఈ కేసులో అకాష్ గౌతమ్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా, మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.