ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జూన్ 2022 (11:35 IST)

వ‌న్‌ప్ల‌స్ 10టీ 5జీ డిజైన్ వివరాలు ఆన్‌లైన్‌లో లీక్

OnePlus 10T 5G
OnePlus 10T 5G
వ‌న్‌ప్ల‌స్ 10 ప్రొ 5జీ త‌ర్వాత వ‌న్‌ప్ల‌స్ 10 సిరీస్‌లో వ‌న్‌ప్ల‌స్ 10టీ 5జీ డిజైన్ వివరాలు ఆన్‌లైన్‌లో లీకైనాయి, ఈ ప్రీమియం ఫోన్ రెండ‌వ స్మార్ట్‌ఫోన్‌గా క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానుంది. వ‌న్‌ప్ల‌స్ 10టీ 5జీ ప్రొడ‌క్ష‌న్‌ జులైలో ప్రారంభం కానుంది. లేటెస్ట్ వ‌న్‌ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఈ నెలాఖ‌రున ఖ‌రార‌వుతుంద‌ని తెలుస్తోంది. 
 
ఇక ఆన్‌లైన్‌లో లీకైన వ‌న్‌ప్ల‌స్ 10టీ 5జీ డిజైన్ ప్ర‌కారం లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ వ‌న్‌ప్ల‌స్ 10 ప్రొను పోలి ఉంటుంది కెమెరా మాడ్యూల్ డిజైన్ వ‌న్‌ప్ల‌స్ 10ప్రొ త‌ర‌హాలో ఉంటుంది. 150డ‌బ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో 4800ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్ధ్యం క‌లిగిఉంటుంది.
 
ఫీచర్స్
8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 
2ఎంపీ మ్యాక్రో కెమెరా, సెల్ఫీల కోసం ఫోన్ ముందుభాగంలో 16ఎంపీ కెమెరా ఉంటుంది. 
6.7 ఇంచ్ పుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను క‌లిగిఉంటుంది. 
 
ఇక వ‌న్‌ప్ల‌స్ 10టీ 5జీ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజ‌న్ ఓఎస్ 12పై ర‌న్ అవుతుంది.
ఎఫ్‌\1.8 అపెర్చ‌ర్‌తో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌766 మెయిన్ కెమెరాతో వ‌న్‌ప్ల‌స్ 10టీ 5జీ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోనుంది.