గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (22:33 IST)

నాని గురించి నజ్రియా ఏమంది.. భర్త అలా వుంటే చాలట!?

Nazria
మలయాళీ బ్యూటీ నజ్రీయ నజీమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా ఆమె తెలుగులో అంటే సుందరానికి సినిమాలో కనిపించింది. ఈ సినిమా విడుదలకు అనంతరం ఓ ఇంటర్వ్యూలో తన భర్త గురించి చెప్పుకొచ్చింది. 
 
25 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నానని.. ఫహద్ తన జీవితంలోకి ఒక అద్భుతంలా వచ్చాడు అంటూ తెలిపింది. 
 
ఫహద్ ఫాజిల్ గురించి మాట్లాడుతూ..ఆయన ఒక మెథడ్ యాక్టర్. ఒక పాత్ర చేస్తుంటే ఆ పాత్రలో లీనమైపోతాడని ఆమె చెప్పుకొచ్చారు. అయితే పెళ్లైన తర్వాత ఇంటికొచ్చాక ఒక భర్తగా ఉండాలంటే మెథడ్ యాక్టింగ్ మానుకొని ఇంటికొచ్చిన తర్వాత ఒక భర్తగా ఉంటే చాలు అంటూ వార్నింగ్ ఇచ్చానని నజ్రియా తెలిపింది.
 
ఇక తెలుగులో నాని నటించిన జెర్సీ అంటే తనకు చాలా ఇష్టమని నజ్రియా వెల్లడించింది. నాని సినిమాలు అన్నీ చాలా బాగుంటాయి. అందుకే 'అంటే సుందరానికి' సినిమాకి కూడా వెంటనే ఓకే చెప్పాను అంటూ నజ్రియా వ్యాఖ్యానించింది.