శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (09:43 IST)

భర్తంటే ఇష్టం లేదు.. ప్రియుడితో మాట్లాడుతూ.. భర్త మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది..

జార్ఖండ్ రాష్ట్రంలో  ఫోన్‌లో మాట్లాడుతూ భర్త మర్మాంగాన్ని కోసేసింది ఓ భార్య.  వివరాల్లోకి వెళితే, జార్ఖండ్‌లోని పలాముకు చెందిన ఓ వ్యక్తికి 13 నెలల కిందట పెళ్లి అయ్యింది. అయితే, అతడిని పెళ్లి చేసుకున్న యువతి పెళ్లికి ముందే వేరే యువకుడిని ప్రేమించింది.
 
పెళ్లి అయినా కూడా అతడిని మరిచిపోలేదు. అతడితో ఫోన్లో టచ్‌లో ఉంటూ రోజూ మాట్లాడేది. ఈ క్రమంలో ఆమె, తన ప్రియుడు కలిసి తన భర్తపై ఘాతుకానికి పాల్పడ్డారు. భర్తకు ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది.
 
దీంతో అతడు స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆమె ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూ అతడు చెప్పిన విధంగా భర్త మర్మాంగాలను బ్లేడ్‌తో కోసేసింది. ఈ క్రమంలో భర్త కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వచ్చి అతడిని ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యతో పాటు ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేశారు.