గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జూన్ 2022 (09:52 IST)

రష్మీ రేఖ ఓజా సహజీవనం.. ఆ విషయం ఇంటి యజమాని చెప్పేవరకు తెలియదు..

rashmi rekha ojha
rashmi rekha ojha
ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ రేఖ ఓజా జూన్‌ 18 రాత్రి ఆత్యహత్యకు పాల్పడింది. భువనేశ్వర్‌లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో ఉన్న తన అద్దె ఇంట్లో ఆమె ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
 
గత కొద్ది రోజులుగా ఈ ఇంట్లోనే రష్మీ అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని అందించిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రష్మీ ఆత్మహత్య చేసుకున్న గదిలో ఒక సూసైడ్‌ నోట్‌ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
అందులో తన మరణానికి ఎవరు కారణం కాదని తెలిపింది. ఇంకా 'ఐ లవ్‌ యూ సాన్' అని రాసుకొచ్చింది. రష్మీ వయసు.. 23 ఏళ్లు. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాకు చెందిన రష్మీ 'కెమిటి కహిబి కహా' అనే ఒడియా సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది.
 
అయితే రష్మీ రేఖ గత కొన్నాళ్లుగా సంతోష్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
మరోవైపు రష్మీ తండ్రి కూడా తన కూతురు మరణానికి ఆమె సహజీవనం చేసిన సంతోష్‌ అనే వ్యక్తే కారణమై ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. సంతోష్‌, రష్మీ భార్యాభర్తలుగా నివసిస్తున్నట్లు ఇంటి యజమాని చెప్పేంత వరకు ఆ విషయం మాకు తెలియదన్నారు రష్మీ తండ్రి.