గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (10:00 IST)

ట్రాఫిక్ పోలీసుగా స‌మంత - ఫ్యాన్స్ ఫిదా

Samantha twitter photo
Samantha twitter photo
స‌మంత సినిమాల‌తోపాటు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ కూడా చేస్తుంది. ప‌లు భాష‌ల్లో ప‌లు యాడ్‌లు చేసింది. దుల్క‌న్ స‌ల్మాన్‌తో స్కూటీపై వెలుతుండ‌గా పోలీసు ఆపుతాడు. లైసెన్స్ అడుగుతాడు. నా భార్య గ‌ర్భ‌వ‌తి అర్జంట్‌గా తీసుకెళ్ళాలి అంటూ కానిస్టేబుల్‌కు చెబుతాడు. అప్పుడు స‌మంత పొట్ట లావుగా క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత అందులోపెట్టిన పుచ్చ‌కాయ బ‌య‌ట క‌నిపిస్తుంది. ఇలా చిత్ర‌మైన యాడ్‌లు చేసిన స‌మంతా ఈసారి ఏకంగా త‌నే పోలీస్ కానిస్టేబుల్ అవ‌తారం ఎత్తింది.
 
ర‌ణ‌వీర్ సింగ్‌తో క‌లిసి చేసిన ఆ యాడ్ నెట్టింట్లో క్రేజ్ సంపాదించుకుంది. ట్రాఫిక్ సిగ్న‌ల్ దాటి వ‌చ్చిన ర‌ణ‌వీర్‌ను స్టాప్ అంటూ ఆపి.. ప్ర‌శ్నిస్తుంది. నాకు త‌ల‌నొప్పి త‌ట్టుకోలేక‌పోతున్నా. అందుకే నేను సిగ్న‌ల్ దాట‌ను అంటాడు. వెంట‌నే విక్స్ ఇన్‌హేలర్ రాసుకో అంటూ స‌మాధాన‌మిస్తుంది. ఇందులో ఆమె ధ‌రించిన పోలీస్ డ్రెస్ న‌చ్చి ఆమె కాస్ట్యూమ‌ర్ నెట్‌లో పోలీసు డ్రెస్‌తో వున్న ఫొటోలు డిజైన్ చేసి పోస్ట్ చేసింది. విక్స్ ఇన్‌హేలర్ యాడ్‌లో ట్రాఫిక్ పోలీస్‌గా స‌మంత చేసిన యాడ్ నెట్‌లో మొదటిది అంటూ కాప్ష‌న్ పెట్టింది. ది ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ త‌ర్వాత బాలీవుడ్‌లో క్రేజీ న‌టిగా స‌మంత‌కు పేరు వ‌చ్చేసింది. దానితోపాటు కోట్ల రూపాయ‌లు కూడా యాడ్ రూపంలో వ‌స్తున్నాయి.