బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 జులై 2022 (23:04 IST)

ఊ అంటావా సాంగ్ కంటే మాస్ సాంగ్.. స్టెప్పులేసిన సమంత

Samantha Ruth Prabhu
పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ ను మించే విధంగా సమంత మరో సాంగ్ ఒప్పుకుందని 
ఫిలిమ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ పాట మాస్ ఫ్యాన్సును ఆకట్టుకుంటుందని టాక్ వస్తోంది. 
 
ఇప్పటికే సాంగ్ మినహా యశోద మూవీ షూటింగ్ పూర్తైందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ ఒక్క సాంగ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో జరుగుతోందని తెలుస్తోంది.
 
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం గమనార్హం. మణిశర్మ అందించిన సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
 
యశోద సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి త్వరలో ప్రకటన వెలువడనుందని సమాచారం. సమంత ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 
 
కొన్నిరోజుల గ్యాప్‌లోనే సమంత నటించిన యశోద, శాకుంతలం థియేటర్లలో రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. చైతూతో విడాకుల తర్వాత సమంత కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.