కాఫీ విత్ కరణ్ ట్రైలర్.. రియాల్టీ KGF అని నవ్వేసిన సమంత
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్' షో న్యూ సీజన్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జులై 7నుంచి ప్రారంభం కానున్న షోకు సౌత్ నుంచి విజయ్ దేవరకొండ, ప్రభాస్, రానా కూడా హాజరైనట్లు తెలుస్తోంది.
తాజాగా పలువురు బాలీవుడ్ స్టార్స్‌తో పాటు సమంత కూడా ఈ షో గెస్ట్‌గా హాజరుకాగా.. ట్రైలర్‌లో ఆమె చెప్పిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి.
పెళ్లి గురించి కరణ్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన సామ్.. 'వివాహాలు సంతోషంగా ఉండేందుకు కారణం నువ్వే. మీరు లైఫ్‌ను కేత్రీజీ (కభీ ఖుషి కభీ గమ్)గా ఉంటాయని చిత్రీకరించారు కానీ రియాలిటీ KGF' అని నవ్వేసింది. కాగా ఇదే షోలో చై-సామ్ విడిపోయేందుకు సమాధానం దొరుకుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.