శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 జులై 2022 (11:28 IST)

అనేక మంది పెళ్లిళ్ళు పెటాకులు కావడానికి కారణం మీరే : సమంత

samantha
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌‍ను ఉద్దేశించిన హీరోయిన్ సమంత చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. అనేకమంది సినీ సెలెబ్రిటీల వైవాహిక బంధాలు పెటాకులు కావడానికి ప్రధానకారణం మీరే (కరన్ జోహార్) అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనే కాకుండా చిత్రపరిశ్రమలోనూ వైరల్‍‌గా మారాయి. 
 
కరణ్‌ జోహార్‌ ఒక ఫిల్మ్‌మేకర్‌గానే కాకుండా వ్యాఖ్యాతగానూ బాలీవుడ్‌లో మంచి పేరుంది. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఫేమస్‌ సెలబ్రిటీ టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’. దాదాపు 6 సీజన్లపాటు ప్రేక్షకుల్ని అలరించిన ఈ షో తదుపరి సీజన్‌ మరికొన్ని రోజుల్లో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌-7’ లేటెస్ట్‌ ప్రోమోని కరణ్‌ షేర్‌ చేశారు. 
 
‘కబీర్‌సింగ్‌’ జోడీ షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ, ‘జుగ్‌ జుగ్‌ జియో’ సభ్యులు అనిల్‌కపూర్‌, వరుణ్‌ ధావన్‌, ‘లైగర్‌’ జోడీ విజయ్‌ దేవరకొండ, అనన్యాపాండే, బీటౌన్‌ ఫ్రెండ్స్‌ జాన్వీకపూర్‌, సారా అలీఖాన్‌తోపాటు అక్షయ్‌కుమార్‌, సమంత... ఇలా పలువురు ఈ సీజన్‌లో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించనున్నారు. 
 
ఇక, తన ఎపిసోడ్‌లో సామ్‌.. కెరీర్‌పై ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కరణ్‌.. ఎంతోమంది వివాహబంధాలు బాధాకరంగా ఉండటానికి మీరే కారణం’’ అని ఆరోపించగానే ‘‘నేనేం చేశాను?’’ అని ఆయన ప్రశ్నించారు. దానికి ఆమె.. ‘‘వైవాహిక బంధమంటే ‘కబీ ఖుషి కబీ ఘమ్‌’ సినిమాలా ఉంటుందని మీరు స్క్రీన్‌పై చూపించారు. 
 
కానీ నిజజీవితంలో మాత్రం అది ‘కేజీయఫ్‌’ సినిమాలా ఉంటుంది’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ ఫుల్‌ ఎపిసోడ్‌ కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.