శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 జులై 2022 (19:36 IST)

నాకు డబుల్‌ మీనింగ్‌ పదాలు తెలియవు: నాగచైతన్య

naga chaitanya
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతతో విడాకులపై నాగచైతన్య నోరెత్తలేదు. కానీ సామ్ మాత్రం ఇన్ డైరెక్ట్‌గా చాలా కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ చైతు వరకూ వెళ్లినట్టు ఉన్నాయి. 
 
తాజాగా సమంత గురించి నాగచైతన్య కూడా ఇన్ డైరెక్ట్‌గా కామెంట్స్ చేశాడు. నాగచైతన్య ప్రస్తుతం 'థ్యాంక్యూ యూ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చైతు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
 
ఈ సందర్భంగా చైతు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ర్యాపిడ్‌ క్వశ్చన్స్‌ అంటూ ఐదు డబుల్‌ మీనింగ్‌ పదాలు చెప్పాలని యాంకర్‌ చైతుని కోరాడు. 
 
అయితే.. ఈ మాటకు చైతు తనదైన శైలీలో సమాధానం ఇస్తూ.. 'నాకు డబుల్‌ మీనింగ్‌ పదాలు తెలియవు. నేను ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్తాను. డబుల్‌ మీనింగ్‌లో మాట్లాడడం నాకు ఎప్పటికీ రాదు' అంటూ నాగచైతన్య కామెంట్స్ చేశాడు.