శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2022 (16:29 IST)

ఆదిపురుష్‌కు ఓటీటీ క‌ళ్ళుజిగేల్ చేసే ఆఫ‌ర్‌

Adipurush twitter
Adipurush twitter
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా మారిపోయాక ఓటీటీ సంస్థ‌లు కోట్ల‌ను పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఒక‌ప్పుడు శాటిలైట్ వ‌ర‌కు ప‌రిమితం కావ‌డంతో అంత రేటు వ‌చ్చేదికాదు. ఇప్పుడు వ‌ర‌ల్డ్ మొత్తం చూసేలా ఓటీటీ అనేది కొత్త బిజినెస్ రావ‌డంతో ఆ దిశ‌గా నిర్మాత‌లు సినిమాలు తీస్తున్నారు.
 
తాజాగా ప్ర‌భాస్ న‌టిస్తున్న ఆదిపురుష్‌కు భారీ రేటుతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముందుకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో దీనిపై భారీ క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. సాహో, రాదే శ్యామ్ చిత్రాలు ప్ర‌భాస్‌నుంచి వ‌చ్చినా పెద్దగా ఆడ‌లేదు. కానీ ఆయ‌న రేటు మాత్రం పెరిగిపోతుంది. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో కృతి స‌న‌న్‌, సైఫ్ అలీఖాన్‌తోపాటు ప‌లువున‌టిస్తున్నారు.
 
తాజా స‌మాచారం మేర‌కు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాను 250 కోట్ల‌కు హ‌క్కులు కొనుగోలు చేసింద‌ని తెలుస్తోంది. ఇందులో ప‌లుర‌కాల భాష‌ల‌కు చెందిన హక్కులు కూడా వుంటాయి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా పుణ్య‌మా అని పెద్ద హీరోల చిత్రాలు బిజినెస్ చేయ‌డం ఓటీటీ వ‌ల్ల నిర్మాత‌ల‌కు ఊర‌ట‌గా వుంది.