సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (22:08 IST)

రాముడిగా ప్రభాస్.. సన్నని నడుము.. విశాలమైన భుజాలు..? (video)

Adipurush
Adipurush
'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ గురించి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. బాహుబలిగా ప్రభాస్.. ఆదిపురుష్ కోసం భిన్నంగా కనిపించాల్సి వుంటుందని చెప్పారు. బాహుబలి లుక్స్‌కు ఆది పురుష్ లుక్‌కు భారీ తేడా వుంటుందని ఓం రౌత్ అన్నారు. 
 
ఈ సినిమా గురించి ఓం రౌత్ మాట్లాడుతూ..  "ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రను ప్రభాస్ పోషించాడు. ఈ పాత్రలో సన్నని నడుము .. విశాలమైన భుజాలతో ఆయన కనిపించవలసి ఉంటుంది.
 
అందుకోసం ఆయన మరింత ఫిట్ నెస్‌ను సంపాదించవలసి వచ్చింది. ఎక్కువ సమయం జిమ్ లోనే గడిపాడు. తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం కోసం మరింత పెర్ఫెక్ట్‌గా హిందీ నేర్చుకున్నాడు. ఈ సినిమాలో ఆయన కళ్లు కూడా చాలా షార్ప్‌గా ఉంటాయి" అని చెప్పుకొచ్చాడు. విలువిద్య తెలిసిన వాడిగా ప్రభాస్ నటించాడు. సైఫ్ అలీఖాన్ రోల్ ఈ చిత్రానికి హైలైట్ అని తెలిపాడు. రాముని పాత్ర కోసం ప్రభాస్ తన శరీర ఆకృతిని పూర్తిగా మార్చేశాడని వెల్లడించాడు. 
 
"ప్రభాస్‌ ఓ మంచి వ్యక్తి. తన వర్క్ యాటిట్యూడ్ తో పాటు, ప్రభాస్ ఇంట్లో వండిన ఆహారాన్ని సెట్స్‌కి తీసుకువస్తాడు. అతని గురించి నాకు నచ్చిన విషయం ఏమిటంటే, సెట్‌లో ఉన్న వ్యక్తుల గురించి, వారి స్థాయితో సంబంధం లేకుండా అందరితో కలిసిపోతాడు" అంటూ ప్రభాస్‌‍పై ప్రశంసల వర్షం కురిపించాడు.
 
అలాగే సైఫ్ అలీ ఖాన్‌ను ప్రధాన ప్రతినాయకుడిగా నటింపజేయడం గురించి రౌత్ మాట్లాడుతూ, "సైఫ్‌తో కలిసి పనిచేయడం నాకు గొప్ప అనుభవం. 'తన్హాజీ'లో తన పాత్ర చిత్రీకరణలో అతని ఇంటెన్సిటీ ఈ పాత్రను సులభంగా తీయగలనని నాకు భరోసా ఇచ్చింది" అని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే.. దర్శకుడు ఓం రౌత్ 'ఆదిపురుష్' ప్రస్తుతం నిర్మాణ దశలో వుంది. ఇందులో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రామాయణంకు అనుకరణగా వుంటుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.