శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (12:35 IST)

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సిరి

Siri
రాష్ట్ర మహిళాభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలిగా డాక్టర్ ఎ సిరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం సంయుక్త కలెక్టర్‌గా విధి నిర్వహణలో ఉన్న సిరిని జిల్లాల పునర్ విభజన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖాధిపతిగా నియమించింది.

 
సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గుంటూరులోని సంచాలకుల వారి కార్యాలయంలో పూజాదికాలు నిర్వహించి నూతన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిరి మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు క్షేత్రస్ధాయికి చేరేలా కృషి చేస్తానన్నారు. ఉద్యోగులు అంకిత భావంతో విధులు నిర్వహించి ముఖ్యమంత్రి ఆకాంక్షల మేరకు నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు.