శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 మార్చి 2022 (13:25 IST)

మాజీ జనశక్తి నేత యాదన్న కిడ్నాప్.. పోలీసులే తీసుకెళ్లి వుంటారా?

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అటవీ ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం జనశక్తి నక్సల్స్ సమావేశం జరుపుకున్నారు. సుమారు 80 మంది ఈ సమావేశానికి హాజరైనట్లు తెలిసింది. 
 
పార్టీ సెక్రెటరీ విశ్వనాధ్ నేతృత్యంలో సిరిసిల్లా సరిహద్దుల్లోని పోతిరెడ్డిపల్లి ఫారెస్ట్‌లో 8మంది సాయుధ జనశక్తి నక్సల్స్, 72 మంది సానుభూతిపరులు సమావేశం అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గంగపురంకు చెందిన మాజీ జన శక్తినేత మూర్తి శ్రీనివాసరెడ్డి అలియాస్ యాదన్నను ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. గతంలో యాదన్న జనశక్తి నేతగా పని చేశారు.
 
ఉద్యమంలోంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విచారణలో భాగంగా పోలీసులే తీసుకువెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.