సంబంధిత వార్తలు
- తెలంగాణ - ఛత్తీస్గఢ్ బార్డర్లో ఎన్కౌంటర్ - ఆరుగురు నక్సల్స్ హతం
- విజయవాడలో అభివృధి పనులకు శంఖుస్థాపన చేసిన మేయర్ భాగ్యలక్ష్మి
- నలుగురు కుటుంబ సభ్యులను ఉరితీసిన నక్సలైట్లు
- సుక్మా జిల్లాలో విద్యార్థిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
- ఆర్దిక శాఖలోకి వాణిజ్య పన్నులను కలిపేశారట! ఏదైనా గవర్నర్ పేరిటే!!
కేటీఆర్ జిల్లాలో నక్సల్స్ కదలికలు.. నాలుగు రోజుల పాటు సమావేశాలు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో సాయుధ నక్సల్ దళం కదలికలు కలకలం రేపుతోంది.
రాష్ట్రంలో నక్సల్ కార్యకలాపాలు నిర్మూలించినట్లు పోలీసు యంత్రాంగం అనేక సందర్భాల్లో ప్రకటించిన నేపథ్యంలో తాజాగా సాయుధ దళం సంచరిస్తూ సమావేశాలు ఏర్పాటు చేస్తోందని వెలువడుతున్న వార్తలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
జనశక్తి అగ్రనేత కూర రాజన్న వర్గానికి చెందిన జనశక్తి రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ్ తోపాటు దాదాపు 8 మంది సాయుధ నక్సల్స్, 65 మంది సానుభూతిపరులు, మరికొందరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
సిరిసిల్ల అటవీ ప్రాంతంలో నక్సల్స్ నాలుగు రోజులపాటు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన ఈ కీలక సమావేశంలో సాయధ నక్సల్స్ సహా వరంగల్, నిజామాబాద్, మెదక్, సిరిసిల్ల జిల్లాలకు చెందిన జనశక్తి సానుభూతిపరులు, పూర్వకాలంలో పార్టీలో పనిచేసినవారు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
తర్వాతి కథనం