1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 30 నవంబరు 2021 (17:14 IST)

విజ‌య‌వాడలో అభివృధి పనులకు శంఖుస్థాపన చేసిన మేయ‌ర్ భాగ్యలక్ష్మి

విజ‌య‌వాడ న‌గ‌రంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి శంఖుస్థాప‌న చేశారు. విజ‌య‌వాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 30వ డివిజన్ దేవినగర్ లో రూ.9.25 లక్షలతో ఆర్.సి.సి డ్రెయిన్ నిర్మాణ పనులకు రూ.31.75  లక్షల అంచనాలతో శంకుస్థాప‌న చేశారు. దేవినగర్ కాలువ అంచున ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన శంఖుస్థాపన కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, డిప్యూటీ మేయర్ అవుతు శైలజా రెడ్డితో కలసి పాల్గొన్నారు.  

 
విజ‌య‌వాడ మేయర్ భాగ్య‌ల‌క్ష్మి మాట్లాడుతూ, నగరపాలక సంస్థ సాధారణ నిధులతో దేవినగర్ 5వ క్రాస్ రోడ్ నుండి 6వ క్రాస్ రోడ్ వరకు సుమారు 55 మీటర్ల పొడవున పాడైన డ్రెయిన్ నిర్మాణం చేప‌ట్టామ‌న్నారు. దేవినగర్ కాలువ అంచున సుమారు 500 మీటర్ల పొడవున ఫెన్సింగ్ ఏర్పాటు చేసే పనులకు భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించామ‌ని అన్నారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వేగవంతంగా పూర్తి చేసేట్లు చూడాలని అన్నారు. 
 
                                                                                                                                                        కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ భీమిరెడ్డి శివ వెంకట జానారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వి.శ్రీనివాస్, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్ ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.