శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (16:32 IST)

హైకోర్టులో ఏపీ సర్కారుకు ఊరట... సింగిల్ బెంచ్ తీర్పు రద్దు

నవరత్నాల అమల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దుచేయాలని, అత్యవసర విచారణ జరపాలని కోరింది. 
 
ఈ అప్పీలును అత్యవసరంగా విచారించేందుకు అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి నిరాకరించారు. దీంతో ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఊరట లభించింది. పేదలందరికీ ఇల్లు పథకంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. 
 
పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో తాత్కాలికంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. 
 
ఇళ్ల స్థలాలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. గత నెల 8న పేదలందరికీ స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని తీర్పు ఇచ్చింది.