సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 ఏప్రియల్ 2022 (20:10 IST)

నమ్రతతో అలా ప్రవర్తించిన డైరక్టర్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మహేష్ బాబు

ఒకానోక టైంలో నమ్రత టాప్ హీరోయిన్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన అంజీ అనే మూవీలో నటించి తన నటనతో మెప్పించింది. నమ్రతకి పెళ్లి కాకముందు .. హీరోయిన్‌గా ఉన్నప్పుడు.. ఓ బాలీవుడ్ బడా డైరెక్టర్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడట. 
 
చెత్త మాటలతో అభ్యంతరకర ప్రవర్తనతో టార్చర్ చేసేవాడట. కానీ అప్పుడు భయపడి ఎవ్వరికి చెప్పుకోని నమ్రత..పెళ్లి తరువాత ఆ విషయాన్ని మహేష్‌కు చెప్పుకుని బాధపడిందట. దీంతో కోపంతో మహేష్ ఆ డైరెక్టర్‌కు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాడని.. మరో అమ్మాయి ఇలా బాధపడకుండా గట్టిగా హెచ్చరించాడని అప్పట్లో మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.
 
ఇప్పుడు కూడా మహేష్ బాబు తన సినిమాలో నటించే అమ్మాయిల పట్ల చాలా కేరింగ్‌గా ఉంటాడట. వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేలా చూసుకుంటాడట. తాజాగా మహేష్ బాబు సర్క్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అయిపోగానే.. త్రివిక్రమ్‌తో ఓ సినిమా..రాజమౌళితో మరో సినిమా కమిట్ అయ్యాడు.